
కవిత నెం :2
నీలా ఎవరు ?
నేను వస్తున్నానని తెలిసి పులకరించింది
నీలా ఎవరు ?
నేను వస్తున్నానని తెలిసి పులకరించింది
తన మనస్సులో వర్షపు జల్లును,
తన పెదవులపై చిరు జల్లును నిలిపింది
నా రాక కోసం నవ మాసాలు ఎదురుచూసింది
నా రూపం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకొంది
నేను పుట్టాక ఏడిస్తే ,తను నేను పుడుతుంటే ఏడ్చింది
అప్పుడే తడి ఆరని శరీరంతో వచ్చిన నన్ను చూసి
తన బాధ మర్చిపోయింది
తన కన్నీళ్లను ఆనందబాష్పాలుగా మలచుకుంది
అప్పటిదాక తను పడ్డ శ్రమని దరిచేరనీకుంది
నేను అడగకుండానే నా ఆకలి తెలిసి
తన ఒళ్లో ఉంచుకుని ఉగ్గు పెట్టేది
నా చిన్ని శరీరాన్ని తడిమి తడిమి ప్రేమను పంచేది
నా తడబడే పలుకులకు వంతపాడేది
నా కేరింతలతో తను ఆడుకునేది
నాకు క్రొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది
కాని తను నేనే ప్రపంచం అనుకునేది
నాకు నడక నేర్పింది, నడత నేర్పింది
నా కంట్లో నలత పడకుండా కంటిపాపల కాచింది
నాకు మాటలు నేర్పింది ,మంచితనం ,మానవత్వం నేర్పింది
ఒక మనిషిలా నన్నింత వాడ్ని చేసింది
నేను నవ్వితే తనూ నవ్వేది
నేను ఏడిస్తే తనూ ఏడ్చేది
నాకు కష్టాలు తెలియకుండా పెంచేది
తన కష్టాలను కడగల్లు గా చేసింది
నా అలంకరణతో ,తనను తానూ అలంకరించుకునేది
నాకేమి కావాలో నేనడక్కుండా గ్రహించేది
నాకు అందమైన జీవితాన్ని అందించింది
అందులో బ్రతకటం నేర్పింది
ఏ బాదర బందీలు నాకు తెలియనివ్వంది
నాతో తనకున్న బంధమే చాలనుకునేది
ఆమె ఎవరో కాదు
ఆమె అందరికీ ఉంటుంది
ఆమె అందరిలో ఉంటుంది
అమ్మ అమ్మ అమ్మ
ఈ జన్మనిచ్చింది అమ్మ
ప్రతిజన్మకు ఉండాలి అమ్మ
అందరిదైవం అమ్మ
నీలా ఎవరుండగలరు అమ్మ
No comments:
Post a Comment